ఐపీఎల్లో అతనొక హీరో.. సెలెక్టర్లకు జీరో..!

సాధారణంగా అయితే ఐపీఎల్ టోర్నీ భారత జట్టులో చోటు సంపాదించుకోవాలి అనుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు సరైన ప్లాట్ఫామ్ అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ద్వారా అన్ని జట్లు యువ ఆటగాళ్లను వేలం లో కొనుగోలు చేస్తూ ఉంటాయి. తద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఆ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించుకోవడానికి కూడా ఆటగాళ్లు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొంత మంది ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఎంత ప్రతిభ కనబరిచినప్పటికీ కూడా భారత జట్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేక పోయారు.

అలాంటి ఆటగాళ్లలో ఒకడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్ సందీప్ శర్మ. ఇప్పటి వరకు 90 మ్యాచ్లు ఆడిన సందీప్ శర్మ ఏకంగా 108 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ పవర్ ప్లే లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టి సందీప్ శర్మ ఇప్పటివరకు తాను తీసిన అరవై రెండు వికెట్లు ఓపెనర్ల వే కావడం గమనార్హం. వికెట్లలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ క్రిస్ గేల్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు అయినప్పటికీ 27ఏళ్ల ఆటగాడికి ఇప్పటివరకు టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం.