ఈటెల వెంట ప్రధాని మోడీ ఉన్నారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాంపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బంగారు తెలంగాణ రాలే…బంగారు కుటుంబం అయింది..అంటూ వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. ఈటల వెంట ప్రధాన మంత్రి ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. నిజాం పరిపాలనలో ఉన్నామా మనం ఈ నియంతృత్వం ఏమిటి ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంని తరిమికొట్టే రోజు త్వరలో వస్తుందని కిషన్ రెడ్డి మండి పడ్డారు. కల్వకుంట్ల , ఒవైసీ కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని ఆరోపించారు.

ప్రజల్లో చర్చ మొదలయిందని…హుజురాబాద్ లో బీజేపీ జాతర నడుస్తుందని చెప్పారు. ఏ గ్రామం పోయినా ఈటల జపమే. రెండ్రోజుల ప్రచారమే మిగిలి ఉందన్నారు. Mla ఎలా ఉండాలో యాది పెట్టుకోండి….శాసనసభ జరిగితే గొంతెత్తే నాయకుడు కావాలా?కేసీఆర్ కుటుంబానికి జై జైలు కొట్టే వాడు కావాలా? ప్రశ్నించే నాయకుడు కావాలా? పదిమందిలో ఒకడు కావాలా ? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నలు కురిపించారు. నీతి నిజాయితికి ప్రతిరూపం ఈటల రాజేందర్. అజాతశత్రువు రాజేందర్…అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి…మీరు గెలుస్తారా కేసీఆర్ కుటుంబం ని గెలిపిస్తారా? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నలు కురిపించారు. అంగట్లో గొర్రెలను కొన్నట్లు లీడర్లను కొంటున్నారని…కసాయి వోని దిక్కు మీరు పోవద్దు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.