కిషన్ రెడ్డి: బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారని మర్చిపోయారా..?

-

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్లో బీజేపీ పై నిప్పులు చెరిగారు. లిక్కర్ స్కామ్ కేసు అంతా కూడా ఫేక్ అని మోడీ సృష్టించిన కేసు అని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో బిజెపి నేత మీద కేసు పెట్టడంతో మోడీ తన మీద కక్ష కట్టారని అందుకని లిక్కర్ స్కాం కేసు లో కూతురు కవితని అరెస్ట్ చేశారు అని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ బిజెపి గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్ కి లేనే లేదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఒక్క సీటు గెలవదు అని కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోయారని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకి మంచి మిత్రుడు అని కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news