దేశవ్యాప్తంగా ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తి అయ్యాయి. రెండో దశ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది ప్రమాదకర మేనిఫెస్టో అని విమర్శించారు. ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. దేశ సంపదను వారికి దోచి పెట్టేవిధంగా ఆ మేనిఫెస్టో ఉందని విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. భారత్ రోహింగ్యాలకు అడ్డాగా మారుతుందని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా తెలంగాణ ప్రజలు మరిచిపోతున్నారని ఎద్దేవా చేసారు. ప్రధానంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఒక ఫ్రస్టేటేడ్ ఫాదర్ అని అభివర్ణించారు.