తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కి బహిరంగ లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. స్వామిత్వ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లకు ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించనున్నామని, దీంతో వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఈ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు కిషన్ రెడ్డి.
గతేడాది జూలై 29న తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఇదే విషయం పై లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్ చొరవ చూపించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వామిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ళకు సంబంధించిన ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించి,వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించే స్వమిత్వ (SVAMITVA) పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేడు లేఖను వ్రాశాను. pic.twitter.com/9759HNkCWk
— G Kishan Reddy (@kishanreddybjp) April 3, 2023