కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన కొన్ని ప్రసంగాల అనంతరం లోక్ సభ స్పీక్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయం (రాహుల్ గాంధీ పై ఎంపీగా అనర్హత వేటు మరియు కేసు నమోదు) ఎంత వివాదాస్పదం అయిందో చూస్తున్నాము. ఇలా చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ కు వ్యతిరేక పార్టీలుగా ఉన్న వీరు కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకముగా స్వరం పలికారు. కొందరు నాయకులూ అయితే.. నిరసనలకు పిలుపునిచ్చారు.
కాగా తాజాగా రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ మధ్యంతర బెయిలును ఇవ్వడంతో రాహుల్ గాంధీ బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ చెప్పిన మాయలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నాయని చెప్పాలి. నేను ప్రజాస్వామ్య వ్యతిరేకులపైన ఫైట్ చేస్తున్నానని చెప్పారు. నేను చేస్తున్నా ఈ పోరాటంలో సత్యమే నా దైర్యం , నా ఆయుధం అంటూ గద్గద స్వరంతో చెప్పారు. తదుపరి రాహుల్ గాంధీ కార్యాచరణ ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.