తెలంగాణ రైతులకు కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రైతు ల‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశాడు. అలాగే రైతుల విష‌యం లో త‌మ పై చేసిన వ్యాఖ్య ల‌ను తిరిగి వెనక్కి తీసుకోవాల‌ని అన్నారు. కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పై బ‌హిరంగ చ‌ర్చ కు సిద్దామ అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కొట్లాట రైతు క‌ల్లాల కాడ కాద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద అని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కాగ ప్ర‌స్తుతం వ‌రి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ యాసంగి విష‌యం లో కొనుగోలు కేంద్రాలు కూడా ఉండ‌వ‌ని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయ‌క‌పోతే రాష్ట్రంలో కిష‌న్ రెడ్డి ఇంట్లో ధాన్యం పోస్తామ‌ని అన్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ కార్యాల‌యం లో తోపాటు ఢిల్లీ లో ని ఇండియా గేట్ వ‌ద్ద కూడా ధాన్యాన్ని పోస్తామ‌ని అన్నారు. కాగ కేంద్రం వ‌రి ధాన్యం కొనుగోలు చేయ అని చెప్పింద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్య‌ల పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news