సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్ : కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్

-

వరిధాన్యం కొనుగోలుపై మరోసారి సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. కేబినెట్ మీట్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో వివక్ష చూపిస్తుందని అన్నారు.

యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ షాక్ తగిలింది. యాసంగి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక కొనుగోలు కేంద్రాలు… ఉండబోవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక ప్రకటన చేశారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు.. చేయడం లేదని అందుకే యాసంగి లో కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు దృష్టిలో ఉంచుకొని… ఇతర పంటలు వేసుకోవాలని ఆయన తెలిపారు.

ధాన్యం నిల్వ‌లు పెరిగితే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ధాన్యం నిల్వ‌లు పెరిగితే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్య‌త కూడా కేంద్ర ప్ర‌భుత్వాని దే అని తెలిపారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాల పై నెట్ట‌డం స‌రి కాద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం చెప్పెవ‌న్నీ కూడా అబ‌ద్ధాలే అని సీఎం కేసీఆర్ అన్నారు. వ‌రి ధాన్యం విష‌యం లో కేంద్ర ప్ర‌భుత్వం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. నిల్వ‌లు పెరిగాయ‌ని చెప్ప‌డం హాస్య‌స్ప‌దం అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న చిల్ల‌ర రాజ‌కీయాల వ‌ల్ల దేశ వ్యాప్తం గా రైతులు అయోమాయం లో ప‌డ్డార‌ని అన్నారు.

తెలంగాణ రైతులకు కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

తెలంగాణ రైతు ల‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశాడు. అలాగే రైతుల విష‌యం లో త‌మ పై చేసిన వ్యాఖ్య ల‌ను తిరిగి వెనక్కి తీసుకోవాల‌ని అన్నారు. కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పై బ‌హిరంగ చ‌ర్చ కు సిద్దామ అని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కొట్లాట రైతు క‌ల్లాల కాడ కాద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద అని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కాగ ప్ర‌స్తుతం వ‌రి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

 

కేంద్రం కొనుగోలు చేయకున్నా…వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం

ధాన్యం కొనుగోలు విషయం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వివాదం జరగుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ మరోసారి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంతో కేంద్ర వైఖరి సరిగా లేదని విమర్శించారు. తాజాగా యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. అయితే కేంద్రం కొనుగోలు చేయకున్నా.. వానాకాలం పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్రం తీసుకోక పోతే కొనుగోలు చేసిన పంటను బీజేపీ ఆఫీసుల ముందు, కిషన్ రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం అని హెచ్చిరించారు.

కేంద్రం చిల్లర కొట్టులాగా వ్యవహరిస్తోంది

వరిధాన్యం కొనుగోలుపై మరోసారి సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైసే అని.. వీటిని తీసుకోవాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా.. స్పందన లేదని ఆయన అన్నారు. బాధ్యత నుంచి తప్పించుకుని రాష్ట్రాలపై నెపం నెట్టాలని చూస్తుందని ఆయన కేంద్రాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో వివక్ష చూపిస్తుందని అన్నారు. కేంద్రం మాట్లాడితే పచ్చి అబద్ధాలు చెబుతుందన్నారు. 140 కోట్ల మందికి బాధ్యత వహించే కేంద్రం ఇలా వ్యవహరించవద్దని ఆయన అన్నారు. కేంద్రం రైతుల, పేదల వ్యతిరేఖ విధానాలను అమలు చేస్తోందని దుయ్యబట్టారు.

బాయిల్డ్ రైస్ విష‌యం లో మెడ మీద కత్తి పెట్టి రాయించారు

బాయిల్డ్ రైస్ ను సేక‌రించ వ‌ద్ద ని రాష్ట్ర ప్ర‌భుత్వం మెడ పై క‌త్తి పెట్టి సంత‌కం పెట్టించార‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక గింజ కూడా కొనుగోలు చేయ‌మ‌ని చెప్పింద‌ని అన్నారు. ఇటీవ‌ల తామ బృందం కూడా ఢిల్లీ వెల్లిన‌ప్పుడు కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కూడా ఇదే విష‌యం చెప్పార‌ని అన్నారు. కానీ తెలంగాణ లో యాసంగి లో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతుంద‌ని అన్నారు.

బీజేపీ రైతు హంతక పార్టీ.. మాది రైతు బంధువుల పార్టీ

ధాన్యం కొనుగోలుపై బీజేపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. రైతు హంతక పార్టీ అని బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 750 మంది రైతులు చనిపోవడానికి కారణం మీరు కాదా.. అని ప్రశ్నించారు. రైతులపై కార్లు ఎక్కించిన పార్టీ, రైతుల్ని కొట్టండి అని చెప్పే పార్టీ మీది కాాాదా..అని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. దిక్కుమాలిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల్ని ఇబ్బందులు పెట్టింది బీజేపీ పార్టీనే అని విమర్శించారు. మీ ప్రధానినే కదా చివరకు రైతులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

బీజేపీ ప్ర‌భుత్వాల క‌న్నా కోటి రేట్లు బెట‌ర్ ఉన్నం

బీజేపీ పాలిత ప్ర‌భుత్వాల క‌న్నా తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి విష‌యం లో కోటి రేట్లు బెట‌ర్ గా ఉన్నామ‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో చాలా అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నామ‌ని అన్నారు. తెలంగాణ లో అమ‌లు అవుతున్న అభివృద్ధి ప‌థ‌కాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల‌లో అమ‌లు అవుతున్నాయో చూపెట్టాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కి స‌వాల్ విసిరాడు. న‌కిలీ విత్త‌నాలు అమ్మకం ఉక్కు పాదం తో తొక్కి వేశామ‌ని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధం గా న‌కిలీ విత్తనాలు అమ్మిన వారి పై పీడీ యాక్ట్ ప్ర‌యోగించామ‌ని తెలిపారు.

 

రైతులు బాగుప‌డాలంటే ఈ దుర్మార్గ‌మైన పాల‌న పోవాలి

దేశ వ్యాప్తం గా రైతులు బాగు ప‌డాలంటే దుర్మార్గ మైన బీజేపీ పాల‌న పోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను తీసుకుంటుంద‌ని అన్నారు. ఇది పోవాలంటే కేంద్రం లో బీజేపీ పోవాల‌ని అన్నారు. రైతు ల తో పాటు మ‌హిళ‌లు, విద్యార్థులు, వ్యాపార వేత్త‌లు బాగు ప‌డాలంటే బీజేపీ ని త‌రిమి కోట్టాల‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పు చేసి దేశ వ్యాప్తం గా రైతు ల‌కు క్ష‌మాప‌ణ లు చెప్పార‌ని గుర్తు చేశారు.

బీజేపీ కార్యాల‌యం లో వ‌రి ధాన్యం పోస్తం

వాన కాలం పంట ను పూర్తి గా రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అయితే త‌మ వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం వాన కాలం వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌కుంటే బీజేపీ రాష్ట్ర కార్యాల‌యం లో వ‌రి ధాన్యం పోస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రం లో ఉన్న కేంద్ర మంత్రి కేష‌న్ రెడ్డి ఇంట్లో కూడా పోస్తామ‌ని అన్నారు. దీంతో పాటు వీలైతే 200 లారీ లు పెట్టి ఢిల్లీ కి వెళ్లి ఇండియా గేట్ వ‌ద్ద వ‌రి ధాన్యం పార బోస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news