టీవీ పెడితే ఆనందయ్య పేరే వినిపిస్తోంది: కేంద్రమంత్రి

హైదరాబాద్: టీవీ పెడితే ఆనందయ్య పేరే వినిపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆయుర్వేదం పైన ప్రజలకున్న నమ్మకంతోనే వేల మంది ఆనందయ్య మందు కోసం వెళుతున్నారని తెలిపారు. ఆయుర్వేదం భారతీయ జీవన విధానంలో ఒక భాగమని చెప్పారు. ఎర్రగడ్డ యునాని ఆయుర్వేద ఆసుపత్రిలో సౌకర్యాలను మెరగుపరిచామని పేర్కొన్నారు. మన పూర్వీకులు అందించిన ఆయుష్ 64 మెడిసిన్ అమృతం లాంటిదని తెలిపారు. తక్కువ సింటమ్స్ ఉన్న వారికి, పోస్ట్ కరోనాలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ మందు పని చేస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఆయుష్షు డిపార్ట్మెంట్‌కు పెద్దపీట వేశారని👆🏻కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.