ప్రేమికుల వారంలో వాలెటైన్స్ డే కి ఒకరోజు ముందు రోజుని కిస్ డే గా జరుపుకుంటారు. ఫిబ్రవరి 13వ తేదీన జరుపుకునే ఈ కిస్ డే కి చాలా ప్రత్యేకత ఉంది. వాలెంటైన్ వారంలో రోజ్ డే తో మొదలై, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అన్నీ కలిసి పరిపూర్ణమైన ప్రేమికుల రోజుకి దారి తీస్తాయి. కిస్ డే అందులోని అద్భుతమైన రోజుల్లో ఒకటి. ప్రేమించినవారి నుదుటిపై, చెంపపై లేదా పెదవులపై ముద్దు ఇవ్వడం ద్వారా తమలోని ప్రేమని అవతలి వారికి తెలియజేస్తారు.
ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే ముద్దు అంత బాగుంటుంది. ఇద్దరినీ ప్రేమించుకునేలా బలవంతం చేయవచ్చేమో కానీ, ముద్దు పెట్టుకునేలా బలవంతం చేయలేమని అంటారు. మనసులో బలమైన ప్రేమ ఉంటే తప్ప అది అది ముద్దు రూపంలోకి మారదు. ఐతే ఈ కిస్ డే రోజున మీరు ప్రేమించినవారు దూరంలో ఉండి కిస్ ఇవ్వలేకుండా ఉంటే మీ మాటల మీ ముద్దులోని తీయదనాన్ని వారికి తెలియజేయండి. కిస్ డే రోజున మీకు కావాల్సిన కొటేషన్లు..
మాటల్లో చెప్పలేని ఎన్నో భావనలని ఒక్క ముద్దు చెబుతుంది. అందుకే మాటలు మాట్లాడ్డం కన్నా ముద్దుపెట్టుకోవడమే ఎక్కువ ఇష్టం.. హ్యాపీ కిస్ డే డియర్.
నా బాధలన్నీ నువ్వు పెట్టే ఒక్క ముద్దుతో తీరిపోతాయి.
నీ ముద్దుతో నా గుండె చప్పుడు వేగం పెరుగుతుంది. అలాగే తగ్గుతుంది కూడా.
ముద్దు అనేది పల్లెంలో పెట్టిన ప్రేమ వంటిది.
నా మనసు నీకు తెలుసు.. నీ మనసు నాకు తెలుసు. నిన్ను ముద్దు పెట్టుకునే క్షణంలో ఈ రెండూ అర్థమైపోతాయి.