నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో రెండో డోస్ కోవిడ్ వ్యాక్సిన్

-

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ పంపిణీ మొదలుకానుంది. మొదటి డోస్ వేసుకున్న చోటనే రెండో డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వనున్నారు. ఇక భార‌త్‌లో జ‌న‌వ‌రి 16 నుంచి ఈ కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా దేశంలో ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పోలీసు వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

vaccine
vaccine

వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా ప్ర‌స్తుతం సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల‌కు కోవిషీల్డ్ డోస్‌ ల‌ను అలానే కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ని ఇస్తున్నారు. ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చిన తరువాత 50 ఏళ్లు పైబ‌డిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు. అయితే వ్యాక్సిన్ ను తీసుకోవాల‌ని ఎవ‌రిపై ఒత్తిడి చేయ‌బోమ‌ని, ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా వ్యాక్సిన్‌ను తీసుకోవ‌చ్చ‌ని, ఇందులో బ‌ల‌వంతం ఏమీ లేద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతూ వస్తున్నా సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news