Cochlear ear kiss injury: చంటి పిల్లల చెవి దగ్గర ముద్దు పెట్టడం ప్రమాదం.. చెవుడు కూడా రావచ్చు..!

-

చంటి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. చంటి పిల్లలు సులువుగా సమస్యల బారిన పడుతుంటారు. వీలైనంత జాగ్రత్తగా పసిపిల్లల్ని చూసుకోవాలి లేకపోతే చిన్న వయసులోనే సమస్యలు వారిలో కలగవచ్చు. చంటి పిల్లలు చూడడానికి ముద్దుగా ఉంటారు. ఎవరికైనా సరే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది.

చాలామంది పిల్లల్ని చూసి ఆగలేక ముద్దులు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకవేళ చెవి మీద ముద్దు పెట్టారంటే పిల్లలకి పూర్తిగా చెవుడు వచ్చే అవకాశం ఉంది. పసిపిల్లలకి ముద్దులు పెట్టడం వలన రకరకాల సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది. వీలైనంతవరకు పసిపిల్లలకు ముద్దు పెట్టకుండా ఉండడం మంచిది. పసిపిల్లల చెవికి తగిలేలా గట్టిగా ముద్దు పెట్టడం వలన ఆ చెవి ఇక వినపడకపోవచ్చు.

Cochlear ear kiss injury ”కోక్లీయర్ ఇయర్ కిస్ ఇంజురీ” కారణంగా పిల్లలకి పూర్తిగా చెవుడు వస్తుంది. పసిపిల్లలకి ఒక చిన్న ముద్దు పెద్ద దృఢమైన సక్షన్ కి గురి చేస్తుంది. వాళ్ళ ఇయర్ డ్రం చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి వారిలో కోక్లియర్ ఇయర్ కిస్ ఇంజురీ జరుగుతుంది దీని కారణంగా పూర్తిగా చెవుడు కలుగుతుంది. పైగా కొన్ని రకాల లక్షణాలు కూడా వారికి కనపడుతూ ఉంటాయి. చెవి దగ్గర అదో రకమైన సౌండ్ రావడం వైబ్రేషన్ లాగ ఉండడం వంటివి కాబట్టి పిల్లలకి చెవి దగ్గర అసలు ముద్దు పెట్టకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version