తమ బౌలర్ పై కేకేఆర్ కీలక ప్రకటన

-

కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ అనుమానిత బౌలింగ్ యాక్షన్ పై కెకెఆర్ ప్రకటన విడుదల చేసింది. అతని బౌలింగ్ ని అంపైర్ లు అనుమానించారు అని ఒక ప్రకటన చేసింది. సునీల్ బౌలింగ్ విషయంలో మేము నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అతని బౌలింగ్ ని సమీక్షిస్తున్నాం. ఈ విషయంలో మేము ఐపిఎల్ తో కలిసి పని చేస్తామని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం త్వరగా వస్తుంది అని మేము ఆశిస్తున్నామని చెప్పింది.

అక్టోబర్ 10 న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై అతని బౌలింగ్ కారణంగానే కేకేఆర్ విజయం సాధించింది. ఆఫ్ స్పిన్నర్ ఇన్నింగ్స్ యొక్క 18 వ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతని బౌలింగ్ యాక్షన్ పై ఫీల్డ్ అంపైర్ లు ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news