కొవిడ్‌ను వాట్సాప్‌ ఎక్స్‌రే సేతులో ఇలా గుర్తిస్తారు

-

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనేక వైద్య సంబంధిత పరికరాలు, మెడిసిన్స్‌ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. త్వరగా వైరస్‌ను గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు ఇదే ప్రధాన ఉద్దేశం. తాజాగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారుచేసిన కొత్త కొవిడ్‌ పరీక్షను ప్రవేశపెట్టింది. ఛాతి ఎక్స్‌రే అదికూడా వాట్సాప్‌ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఆ ప్రత్యేక యాక్సెస్‌ ఉన్న వైద్యులకు ఎక్స్‌రే మెషీన్‌ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీన్నే ఎక్స్‌రే సేతు అంటారు. మొబైల్స్‌ ద్వారా పంపించిన ఇమేజేస్‌తో కూడా ఇది వైరస్‌ను గుర్తిస్తుంది. ఈ టెస్ట్‌ చాలా సులభం రూరల్‌ ప్రాంతాల్లో కూడా ఈజీగా వాడచ్చు. దాదాపు పదివేల మంది వైద్యులు ఒకేసారి దీన్ని వాడచ్చు. ఇది ఆర్టీపీసీఆర్‌ ఆధారంగా పనిచేస్తుంది. నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ ఆర్ట్‌పార్క్‌ సీఈఓ ఉమాకాంత్‌ సోని వార్త పత్రికతో తెలిపారు. ఇది నిర్మాణీ అనే స్టార్టప్‌ కంపెనీతో కలిసి అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. వాట్సాప్‌లో కొవిడ్‌ అనుమానిత వ్యక్తి ఛాతి ఎక్స్‌రేను అప్‌లోడ్‌ చేయాలి అది పరీక్షించి 10–15 నిమిషాల్లో రిపోర్టును వెల్లడిస్తుంది.


ఎలా పరీక్షించాలి?

ఇది కేవలం యాక్సెస్‌ ఉన్న డాక్టర్లు WWW.xraysetu.com ను సెర్చ్‌ చేసి, ‘ట్రై ది ఫ్రీ ఎక్స్‌రే సేతు బిటా’పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. అపుడు ఛాట్‌బాట్‌లో డాక్టర్లు సులభంగా 8046163838 కి వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలి. అప్పుడు ఎక్స్‌రే సేతు సర్వీస్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వారు రోగి ఎక్స్‌రే ఇమేజ్‌ను క్లిక్‌ చేస్తారు, రెండు పేజీల ఆటోమేటెడ్‌ డయాగ్నొస్టిక్‌ ఇమేజెస్‌ కొద్ది సమయంలో వస్తుంది. ఇది దాదాపు 1,25,000 ఎక్స్‌రేల ఆధారంగా పరీక్షించారు యూకేకు చెందిన నేషనల్‌ ఇన్సిట్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌.

భారత్‌లో జరిపిన ఈ పరిశోధనల్లో దాదాపు 98.86 కచ్చితమైన ఫలితాలు వచ్చాయి. గత వారం రోజులుగా దాదాపు 500 మంది డాక్టర్లు ఈ యాప్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారని డాక్టర్‌ సోని తెలిపారు. రాబోయే15 రోజుల్లో 10 వేల మంది డాక్టర్లతో ఒకేసారి పరీక్షించే విధంగా అభివృద్ధి చేస్తామని, కొవిడ్‌ మూడో దశతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత్‌లో మార్చి 31 వరకు దాదాపు 5,335 కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయి అన్ని సెంటర్లలో ఇంకా ఇతర ప్రైవేటుగా కూడా ఎక్స్‌రే మెజీన్లు కరోనా పరీక్షకు ప్రత్యేకంగా అమర్చుతామన్నారు. రాబోవు ఆరు లేదా ఎనిమిది వారాలపాటు ఈ పరీక్షకు ఎటువంటి ఫీజు వసూలు చేయమన్నారు. ఫీజు తీసుకున్న వందకు తక్కువే ఉంటుందన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబోటిక్‌ ఫెసిలిటీ అభివృద్ధికి ఎట్‌పార్క్‌కు రూ.230 కోట్ల సాయాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news