30తర్వాత శృంగార జీవితంలో వచ్చే మార్పులు.. 

వయసు పెరుగుతున్న కొద్దీ శృంగార జీవితంలో మార్పులు వస్తుంటాయి. టీనేజీలో ఉన్నప్పటిలా 20ల్లో ఉండదు. 20ల్లో ఉన్నప్పటిలా 30ల్లో ఉండదు. సెక్స్ లైఫ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందుకే ఈ వయసులో జరగాల్సిన ముచ్చటలు ఆ వయసులోనే జరగాలని చెబుతుంటారు. అదంతా పక్కన పెడితే, ప్రస్తుతం వయసు 30దాటిన వారి జీవితాల్లో శృంగార పరంగా ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

తీవ్రమైన కోరిక లేకపోవడం

30ల్లోకి చేరుకున్నాక అనేక ఒత్తిళ్ళు, సమస్యలు నెత్తిన పడుతుంటాయి. అందువల్ల శృంగారం పట్ల తీవ్రమైన కోరిక ఎక్కువ మందిలో కనిపించదు. చాలామందిలో ఈ వయసులో కోరికలు సహజంగానే ఉన్నప్పటికీ కొంతమందిలో కోరికల లేమి కనిపిస్తుంది.

తక్కువ సార్లు

కోరిక తీవ్రంగా లేనపుడు తక్కువ సార్లే కలుస్తారు. ఈ విషయాన్ని మీ భాగస్వామితో చర్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

సులభ భావప్రాప్తి

భావప్రాప్తికి చేరుకోవడం సులభం ఎందుకవుతుందటే అప్పటి వరకు ఎన్నో రకాలుగా రతి క్రీడలో పాల్గొని ఉంటారు. దానివల్ల వారి శరీర తత్వం అర్థమై ఉంటుంది. అదే 20ల్లో అయితే వారి శరీరం గురించి పెద్దగా తెలియదు.

ప్రయోగాలు

ఒకరి శరీర తత్వం మరొకరికి అర్థం అవుతుంది కాబట్టి ప్రయోగాల కోసం చూస్తారు. అది కూడా ఇద్దరికీ నచ్చినవే అయి ఉంటే బాగుంటుంది. ప్రయోగాల్లోనూ ఏమి చేయగలరో? ఏమి చేయలేరో అన్న భావన స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్ గా ఉంటారు.