Kodali Nani: అందుకే ప్రశాంత్ కిశోర్‌ నిన్న విజయవాడకు వచ్చారు: కొడాలి నాని

-

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ని తాము ఎప్పుడో వాడామని , ఆయన బుర్రలో గుజ్జు అయిపోయిందని కొడాలి నాని చురుకలు అంటించాడు. ఎంతమంది పీకే లను చంద్రబాబు నియమించుకున్న వైయస్ జగన్ గారిని ఏమి చేయలేరని కొడాలి నాని అన్నారు. వైయస్సార్ పార్టీ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు చంద్రబాబు తనపై విమర్శలు చేశారని ఇప్పుడేమో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కాలం చెల్లిన నాయకుడని అన్నారు.

ఐ ప్యాక్ కి, ప్రశాంత్ కిషోర్ కి అసలు సంబంధం లేదని చెప్పారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలోకి టిడిపిని చేర్చాలని చెబితే వచ్చాడని అన్నారు. ఇక్కడి పీకే భాజపాతో చర్చలు జరుపుతు ఉంటే, బీహార్ నుంచి వచ్చిన మరో పీకె ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నారని కొడాలి నాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news