జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు పుట్టలేదు : కొడాలి

రామనాయుడు స్టూడియోలో ఏపి మంత్రి కొడాలి నాని ఆటో రజిని చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమపై పవన్ చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు. జగన్ మోహన్ రెడ్డికి ఎవరి మద్దతు అవసరం లేదని కొడాలి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.kodali-nani

పవన్ కళ్యాణ్ కు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా, జగన్ ను టచ్ చేసి చూడు అంటూ పవన్ కళ్యాణ్ కు కొడాలి సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ జగన్ చిటికన వేలు కూడా తాకలేడంటూ కొడాలి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆ….హు అంటే జగన్ ప్రభుత్వం భయపడదని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం తన పై కోపం తోనే చిత్ర పరిశ్రమ పై ఒత్తిడి తెస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే.