హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరియు టీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని..ఆరోపించారు. హుజూరాబాద్ లో రెండు పార్టీల అభ్యర్థులు బయట తిట్టుకుంటూ ఉన్నారని.. కానీ బంగ్లాలో మాట్లాడుకుంటారని చురకలు అంటించారు. తెలంగాణ లో టీఆర్‌ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
Nsui యూత్ కాంగ్రెస్ నాయకులు అంతా హుజూరాబాద్ బాట పట్టాలని… కష్టపడి పనిచేస్తే రాజకీయం మర్చేయవచ్చారు రేవంత్ రెడ్డి. కష్టపడి పని చేసే వారికి టికెట్స్ ఇస్తామని… పని చేస్తే మీ ఇంటికే వచ్చి బి ఫార్మ్ ఇస్తానని కార్యకర్తలు మరియు నాయకులకు చెప్పారు. పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు. నిన్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చేసిన లాఠీచార్జీని బీజేపీ ఎందుకు ఖండించడం లేదు ? అని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వం అంటే భయపడే పరిస్థితి వచ్చిందని…ప్రజల మీద దాడులు చేసి.. కెసిఆర్, కేటీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు. శ్రీకాంతా చారి విగ్రహం కి పూల మాల వేసినా ప్రభుత్వం తీసేస్తుందని… శ్రీకాంత చారి అంటే ఎందుకు అంతా కోపమన్నారు.