బద్వేలు ఉప ఎన్నిక ఎకగ్రీవం !

-

అమరావతి : బద్వేలు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ పై టీడీపీ పార్టీ లో భిన్నాభి ప్రాయాలు వెల్లు వెత్తుతున్నాయి.  గత సంప్రదాయాలను పాటించాలనే అభిప్రాయం తో పలువురు టీడీపీ నేతలు.. అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం అందుతోంది. మృతి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బయ్య భార్యకే వైసీపీ పార్టీ టిక్కెట్ ఇచ్చిన నేపథ్యం లో…పోటీ నుంచే పూర్తిగా టీడీపీ పార్టీ తప్పు కోవాలని కొందరు నాయకులు పట్టుబుతున్నట్లు తెలుస్తోంది.

సానుభూతి కోణం లో పోటీకి దూరంగా ఉండాలంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీ అభ్యర్ధి గా రాజశేఖర్ ను ప్రకటించిన తరువాత పునరాలోచన వద్దంటున్నారు మరి కొంత మంది నేతలు. దీంతో బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవాళ సాయంత్రం లోపు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది తెలుగు దేశం పార్టీ అధి ష్టానం. ఇక అటు ఏక గ్రీవం దిశగా పార్టీలు ఆలోచించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులే సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. అటు ఇప్పటికే జనసేన పార్టీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బద్వేలు ఉప ఎన్నిక ఏక గ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news