భారతీయ జనతా పార్టీ… తెలంగాణ రాష్ట్రంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఢి కొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు చేస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలో… తెలంగాణ ఉద్యమ కారులను.. పార్టీ లో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీలోకి ఆహ్వనించగా… ఇటీవలే.. విఠల్ కు కండువా కప్పింది.
అటు.. కేసీఆర్ పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న ను కూడా బీజేపీ లో ఆహ్వానించి… బలంగా తయారువుతోంది. ఇక తాజాగా మరో ఉద్యమ కారుడికి వల వేసింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన… తెలంగాణ జనసమితి పార్టీ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం ను టార్గెట్ చేసింది బీజేపీ పార్టీ. తమ పార్టీలోకి రావాలని… ఆయనను ఆహ్వానించింది బీజేపీ పార్టీ. ఇప్పటికే దీనిపై కోదండరాం తో చర్చలు కూడా జరిగాయట. అన్ని సెట్ అవుతే.. పార్టీనే విలీనం చేసేందుకు కోదండరాం సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.