సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం ఏపీలో వైసీపీ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారీ వరదల కారణంగా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ దెబ్బతింది. దీని కింద ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం ఆ ముంపు గ్రామాల ప్రజలకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్ట్ కింద ముంపుకు గురైన 6 గ్రామాల్లోని 3500 డ్వాక్రా సంఘాల మహిళల రుణాలను ప్రభుత్వం మాఫి చేసింది. వారి పేరిట నవంబర్ ఆఖరి వరకు ఉన్న రూ. 8.98 కోట్లను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది ప్రభుత్వం. వన్ టైం చర్య కింద ఈ రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల రాయల సీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప, చిత్తూర్, అనంతపూర్, నెల్లూర్ జిల్లాలు వర్షాలు, వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఈసందర్భంగా వరదల్లో నష్టపోయిన మహిళలకు రుణాల మాఫీఫై హామీ ఇచ్చారు.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం… వారికి రుణాలు మాఫీ..
-