రాష్ట్రంలో గుడిసె అనేది ఉండకూడదనేది మా లక్ష్యం : విజయ సాయిరెడ్డి

ఎవరికీ ఇల్లు లేకుండా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో పట్టాలు పంపిణీ చేస్తున్నామని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. పట్టాలు ఇవ్వడమే కాదు ఇల్లు కట్టి ఇస్తాం అని ఆయన అన్నారు. చంద్రబాబు పార్టీ జెండాలో గుడిసె  ఉంటుంది.. ఎందుకు పెట్టుకున్నారో తెలియదన్న ఆయన మన రాష్ట్రంలో గుడిసె అనేది ఉండకూడదనేది మా లక్ష్యం అని అన్నారు.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

వెంకన్న పాలెంలో ఎస్ ఈ జెడ్ కు రావడానికి కృషి చేస్తామన్న ఆయన చోడవరంలో 113 కోట్ల రోడ్లను మంజూరు చేశామని అన్నారు. జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారి. డిగ్రీ కాలేజి ప్రాంగణంలో పిజి సెంటర్ కు శంకుస్థాపన చేసిన విజయ సాయి రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ కూడా చేపట్టారు.