Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన విరాట్ కోహ్లీ..వీడియో వైరల్

-

గతేడాది డిసెంబర్ 17 వ తేదీన విడుదలైన “పుష్ప” సినిమా ఫీవ‌ర్ ఇంకా త‌గ్గ‌లేదు. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఈ సినిమా కు సంబంధించిన పోస్టు ల‌ను డైలాగ్స్ ను సోష‌ల్ మీడియా లో పోస్టు చేస్తునే ఉన్నారు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా లోని త‌గ్గేదే లే.. అనే డైలాగ్ చెప్పారు. ఇటీవలే టీమిండియా క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా త‌గ్గేదే లే.. అంటు డైలాగ్ చెప్పాడు.

అయితే తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా “త‌గ్గేదే లే” అనే డైలగ్ తో రెచ్చిపోయాడు. అయితే త‌గ్గేదే లే.. డైలాగ్ చెప్పకపోయినా.. అచ్చం అల్లు అర్జున్ లాగా గ్రౌండ్ లోనే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు కోహ్లీ. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే శ్రీలంక జట్టుపై దుమ్ముదులిపే విజయాన్ని అందుకుంది టీమిండియా.

Read more RELATED
Recommended to you

Latest news