కోహ్లిని విమర్శించేవారికి సెన్స్ లేనట్లే: కోహ్లీ చిన్ననాటి కోచ్

-

రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్పై విమర్శించేవారందరికీ సెన్స్ లేదని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ మండిపడ్డారు. ‘అతడి ఇన్నింగ్స్ను సెల్ఫిష్ అనడం దారుణం అని విమర్శించారు. కొంతమంది వార్తల్లో ఉండేందుకే ఇలా చేస్తుంటారు. వారు ఒక ఎజెండా ప్రకారమే కోహ్లిని విమర్శిస్తున్నారు. రాజు ఎప్పుడూ రాజుగానే ఉంటారు. కోహ్లి కూడా అంతే’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉంటే… ఈ ఏడాది ఐపీఎల్ లో విరాట్ 105 సగటు, 146 స్ట్రైక్తేట్తో 316 రన్స్ చేయగా, మిగతా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లందరూ కలిపి 496 రన్స్ మాత్రమే చేశారు.

కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు పొందింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.ఇక మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12×4, 4×6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news