టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉగాది పచ్చడి అందించారు వేద పండితులు. అనంతరం పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రావణం వినిపించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరిగింది.
పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందని.. చంద్రబాబుకు అధికార యోగం ఉందన్నారు. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతోందని వెల్లడించారు.
బ్రహ్మ – మోడీ, విష్ణువు – పవన్, ఈశ్వరుడు – చంద్రబాబు అని… 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ సెగ్మెంట్లు గెలుస్తారని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ వెల్లడించారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారన్నారు మాచిరాజు వేణుగోపాల్. టీడీపీది వృశ్చిక రాశి…. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారన్నారు.