కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అరెస్ట్ !

Join Our Community
follow manalokam on social media

టీవీ నటుడు సమీర్ అలియాస్ అమీర్ అరెస్ట్ అయ్యారు. ఆయనని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక బోటిక్ వ్యవహారంలో తన స్నేహితుల మీద అతను దాడి చేశారు. రిమాండ్ నిమిత్తం ఆయనను చర్లపల్లి జైలుకు అమీర్ ని తరలించారు. నిజానికి కొద్ది రోజుల క్రితమే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ మీద కేసు నమోదైంది. లైంగికంగా వేధించాడని సమీర్ మీద కొంత మంది ఫిర్యాదు చేశారు.

సమీర్ మరో ముగ్గురితో కలిసి తన మీద దాడికి పాల్పడ్డాడని ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తమ వద్ద ఐదు లక్షలు తీసుకున్నాడు అని యువతులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే దాడి చేశాడంటూ యువతుల ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోయిలమ్మ అనే సీరియల్ దాదాపుగా ఇప్పటికి 800 ఎపిసోడ్స్ కు దగ్గర అయ్యింది. మాటీవీ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.  

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...