EPFO పోర్టల్ లో కొత్త ఫీచర్… వివరాలు ఇవే…!

-

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని వల్ల కలిగే సౌకర్యం ఉద్యోగి కంపెనీ నుండి ఎప్పుడు జాబ్ వదిలి వచ్చేస్తారు అనేది ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఏది ఏమైనా రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఫండ్స్ ఆలస్యమైపోయి ఉండవచ్చు. అందుకే EPFO పోర్టల్ లో ఈ కొత్త ఫెసిలిటీ ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే దీని కోసం మీరు డేట్ అఫ్ ఎగ్జిట్ ని పోర్టల్ లో ముందుగానే పెట్టుకోవచ్చు. అయితే ఉద్యోగికి జాయిన్ అయ్యే రైట్ ఎలా ఉందో అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఉంది.

ఇప్పుడు ఈ కొత్త సౌకర్యం వచ్చింది కనుక అకౌంట్ హోల్డర్స్ తమకు తాముగా డేట్ అఫ్ ఎగ్జిట్
పెట్టవచ్చు. ఇది ఆన్లైన్ లోనే జరుగుతుంది. పైగా దీనిని సులువుగా అప్లోడ్ చేయవచ్చు దీనికోసం మీరు https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్సైట్ లోకి వెళ్లి UAN పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. UAN యాక్టివ్ గా ఉండాలి గుర్తుంచుకోండి. ఇప్పుడు మేనేజ్ స్టాప్ సెక్షన్ లో మార్క్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయిమెంట్ అనే డ్రాప్-డౌన్ మీకు కనిపిస్తుంది.

ఇప్పుడు మీరు మీ పిఎఫ్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. మీరు ఎప్పుడైతే ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలి అని అనుకుంటున్నారో ఆ డేట్ ని అక్కడ అప్లోడ్ చేయండి. రిటైర్మెంట్, షార్ట్ సర్వీస్ అనే ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి. ఓటిపి రిక్వెస్ట్ మీద క్లిక్ చేశాక ఓటిపి వస్తుంది. ఓటిపిని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ పూర్తి అయిపోయినట్టే పీఎఫ్ అకౌంట్ లో ఇది రికార్డు అయిపోతుంది. ఒకసారి కనుక మీరు మార్చారంటే మళ్లీ మార్చడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఈ మధ్య కాలంలోనే జాబ్ నుంచి బయటకు వచ్చారు అంటే రెండు నెలల వరకు బయటికి రావడానికి ఆగాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news