కరోనా రోగుల కోసం పాకెట్ వెంటిలేటర్.. కోల్ కతా సైంటిస్టు

-

కరోనా సెకండ్ వేవ్ చాలా మందిని ఆస్పత్రి పాలు చేసింది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా సోకిన తర్వాత ఆస్పత్రికి వెళ్ళే వారి సంఖ్య సెకండ్ వేవ్ లోనే పెరిగింది. ఈ కారణంగానే ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు లేకపోవడం, బెడ్లు దొరక్కపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది వెంటిలేటర్లు సమయానికి దొరక్క ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇలాంటి ఇబ్బందులని దూరం చేయడానికి కోల్ కతా సైంటిస్టు పాకెట్ వెంటిలేటర్ తో ముందుకు వచ్చాడు.

రాజేంద్రలాల్ అనే శాస్త్రవేత్త పాకెట్ వెంటిలేటర్ ని తయారు చేసాడు. దీనివల్ల పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగిని కాపాడవచ్చని, కరోనా వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతో ఈ పాకెట్ వెంటిలేటర్ ని తయారు చేసానని చెప్పుకొచ్చాడు. దీనికి ఖర్చు కూడా తక్కువే అని, తక్కువ ధరలో సరైన వైద్యం అందేవరకు ప్రాణాలను నిలబెడుతుందని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news