కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపించిన రాష్ట్రం ముంబై అనే చెప్పాలి. మొదటి వేవ్ నుండి చూసుకుంటే కరోనా వ్యాప్తి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా, ఎక్కువగా ఉంది. ఇక సెకండ్ వేవ్ లోనూ అదే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు రాకముందే వేయికి పైగా కేసులు మహారాష్ట్రలో వచ్చాయి. చాలా ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. ఐతే కరోనా టైమ్ లో ఎక్కువగా ఇబ్బందిపడిన ప్రాంతాల్లో ధారావి కూడా ఒకటి. ముంబైలోని ఒక ప్రాంతమైన ధారావిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
దగ్గర దగ్గర ఇండ్లు, జనసాంద్రత ఎక్కువగా ఉండడం మొదలగు కారణాల వల్ల కేసులు బాగా పెరిగాయి. ఐతే అంతలా పెరిగిన కేసులు ఇప్పుడు జీరో అయ్యాయి. అవును, ముంబైలోని ధారావిలో నిన్న ఒక్క కేసు కూడా రాలేదు. ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. కరోనా సెంటర్ గా మారి ఎంతో భయాందోళనకి గురి చేసిన ధారావి ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషించాల్సిన విషయమే. ఈ మేరకు బృహన్ ముంబై ధారావి కరోనా వివరాలు వెల్లడి చేసింది.