ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ త్వరలోనే షురూ కానుంది. ఇప్పటికే జట్లన్నీ తమ ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని జట్లు తమ టీమ్ నుంచి కొందరిని పంపించేసి మరికొందరిని కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ని వద్దనుకుంది.
ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రౌడర్స్ ట్రేడ్ ఒప్పందంలో ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో శార్థూల్‌ని రూ.10.75 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆశించినంతగా రాణించకపోవడంతో దిల్లీ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది. శార్థూల్‌ని అమ్మేయడంతో దిల్లీ క్యాపిటల్స్ మూడో విడత ట్రేడ్ ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది.
కేకేఆర్ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా శార్థూల్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ ల్యూక్ ఫెర్గూసన్, రహమనుల్లా గుర్బాజ్‌లను తీసుకుంది. నవంబర్ 15వ ఆఖరు తేదీ కావడంతో అన్ని జట్లు ఇప్పటికే కొందరు ఆటగాళ్లను ఇతర జట్లకు అమ్మేశాయి.