అన్నతో ఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్… ఫొటోలు వైరల్ !

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రచారం చేయడంతో డబ్బుల ప్రవాహం కొనసాగుతోంది ఆ నియోజకవర్గంలో. అటు ఎన్నికల నియమాల ప్రకారం, ఇతర ప్రాంతాల నాయకులు అంతా మునుగోడును వదిలేశారు. రేపు మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డి సైతం, ఆస్ట్రేలియాలో వెంకట్ రెడ్డి తో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో వారిద్దరు  ఎప్పుడో దిగిన ఫోటోలను… ఉప ఎన్నికకు ముందు కొంతమంది వైరల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒకటేనని, సందేశం ఇచ్చేలా ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే దీనిని రాజగోపాల్ రెడ్డి బృందం ఖండించింది. కావాలనే తమపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి బృందం. ఏదేమైనా ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోటో వైరల్ కావడం ఆసక్తిని రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news