కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కోమటిరెడ్డి, కేశినేని నాని భేటీ

-

ఢిల్లీః కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కోమటిరెడ్డి, కేశినేని నాని భేటీ అయ్యారు. హైదరాబాద్— విజయవాడ హైవే గురించి ఈ సందర్భంగా భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎమ్.పి కేశినేని నాని చర్చించారు. మే నెలలో హైదరాబాద్ – విజయవాడ 6 లైన్ల రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పనులు ప్రారంభించాలని GMR సంస్థకు మంత్రి నితిన్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఈ సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని GMR సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు ఇతర అంశాలను కూడా కేంద్ర మంత్రి తో ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడం, ఎక్స్ ప్రెస్ హైవేగా విస్తరించడం లాంటి వాటిపై చర్చించారు.

అలాగే NH 30 ఇబ్రహీంపట్నం – అమరావతి కనెక్టివిటీ, విజయవాడ- నాగపూర్ కొత్త ఎక్స్ప్రెస్ హైవే, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు లను వెడల్పు చేయడం, మహానాడు రోడ్డు, రామవరపాడు, ఎనికేపాడు T జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ ల నిర్మాణం, విస్సన్నపేట గ్రామానికి బైపాస్ నిర్మించడం, విజయవాడ నగరానికి కొత్త తూర్పు బైపాస్ నిర్మించడం, గొల్లపూడి బైపాస్ నిర్మాణం పనులు వేగవంతం చేయడంపై మంత్రి నితిన్ తో చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news