రేవంత్ కు కోమటిరెడ్డి కౌంటర్..సోనియాను దెయ్యం అన్నారు !

ఇవాళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. సోనియా గాంధీ దేవత అని… కానీ తమ పార్టీలోనే కొందరు దెయ్యం అన్నారని.. రేవంత్‌ కు చురకలు అంటించారు. కానీ..తాను సోనియాను అలా అననని… ఇందిరా గాంధీ చేయని దైర్యం సోనియా గాంధీ చేశారని తెలిపారు.

రైతులు ధాన్యం కొనకపోతే అనారోగ్యం తో వెంకన్న అనే రైతు చనిపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. టోకెన్ల కోసం తమ జిల్లాల్లో బార్లు తీరుతున్నారని… రోజూ అధికారులతో మాట్లాడితే కూడా ఫలితం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ కి హుజూరాబాద్ ఓడిపోయమనే బాధ ఉండొచ్చని… వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఓడిపోయా అనే బాధ కామన్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీపావళి పండగ పూట… రైతు చనిపోయాడని… రైతుల బాధ పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలు మర్చిపోవాలని… ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 750 బోనస్.. 2000 మద్దతు ధర ఇస్తుందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని… రైతు తిరగపడితే… దేశం గడగడ లాడుతుందని హెచ్చరించారు కోమటిరెడ్డి.