పెట్రోల్ ధరలు పెంచడంపై జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.. కేంద్రం డిజీల్, పెట్రోల్ పై ధరలు తగ్గించినా.. ఏపీలో తగ్గించడం లేదని.. ఏపీలో కంటే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువే అన్నారు. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. తానొస్తే పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన జగన్.. ఎందుకు తగ్గించడం లేదు..?అని ఫైర్ అయ్యారు. మాట మీద నిలబడాలి కదా..? అసలు సీఎం జగన్ కు సిగ్గుందా..? అంటూ రెచ్చిపోయారు చంద్రబాబు.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించగానే చాలా రాష్ట్రాలు కూడా తమ పరిధి మేరకు ధరలు తగ్గించాయన్నారు. ఆ రాష్ట్రాలు తగ్గించిన విధంగా ఏపీలో ధరలెందుకు తగ్గించరు..? అధికారం ఉంది కదా అని బాదుడే బాదుడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలు పెరిగితే పరిశ్రమలు, వ్యవసాయం కష్టంగా మారతాయని తెలిపారు.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలు చేపడతామని… పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలను అన్ని రాష్ట్రాలకంటే తగ్గిస్తామని జగన్ చెప్పారుగా..? అలాగే చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.