కాంగ్రెస్ లో కీలక సమావేశం.. బుజ్జగించే పనిలో వీహెచ్..

-

హుజూరాబాద్ ఓటమి తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు పార్టీ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం వాడీవేడీగా కొనసాగింది. నేతలు పార్టీ లైన్ దాటితే క్షమశిక్షణ చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ హెచ్చరించారు.

ఇదిలా ఉంటే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గత కొంత కాలం నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కోమటి రెడ్డిని బుజ్జగించే పనిని సీనియర్ నేత వీ హనుమంత రావుకు అప్పగించింది. దీంతో శనివారం సీఎల్పీలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో వీహెచ్ సమావేశమయ్యారు.  గతంలో పీసీసీ అధ్యక్షపదవి కోసం బాగా ట్రైచేసిన వెంకట్ రెడ్డి అది రాకపోయే సరికి పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉంటున్నారు. దీంతో ఇప్పడు వీహెచ్ తో జరిగిన సమావేశం కాంగ్రెస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news