రేవంత్‌తో కోమటిరెడ్డి..అసలు ట్విస్ట్ వేరే ఉందా?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం ఏంటో అసలు అర్ధం కాకుండా ఉంది..ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా ఉంటూనే..అదే కాంగ్రెస్ పార్టీలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. వరుసపెట్టి ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇంకా గాంధీ భవన్ మెట్లు తొక్కనని చెప్పారు. ఆ మధ్య మునుగోడు ఉపఎన్నికలో బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసిన తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్ధతు తెలిపారు.

కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లారు. ఆఖరికి రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో జరుగుతున్నప్పుడు కూడా రాలేదు. చివరికి ఆయనని పార్టీ నుంచి తప్పిస్తున్నారని, ఆయన ఇంకా బి‌జే‌పిలోకి వెళ్ళడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇంత జరిగినా తరుణంలో సడన్ గా కోమటిరెడ్డి గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా రేవంత్ రెడ్డితో ముచ్చట్లు పెట్టారు. సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఎవరికి క్లారిటీ లేదు.

అయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా కొత్తగా మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే.  కొత్త ఇంఛార్జ్ ఆహ్వానంతోనే తాను వచ్చానని, ఈ నెల 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొంటానని ప్రకటించారు. తాను ఎప్పుడూ గాంధీ భవన్‌కు రానని చెప్పలేదన్నారు. ఇలా ఊహించని విధంగా కోమటిరెడ్డి ట్విస్ట్ తో కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇకపై కోమటిరెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఎలాంటి ట్విస్ట్ లేకుండా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటారా? అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా కోమటిరెడ్డి ఎప్పుడు ఎలా రాజకీయం చేస్తారో క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version