తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తో పొసగక ఈ మధ్యనే బీజేపీలోకి వెళ్ళిపోయాడు. కానీ బీజేపీలోనూ అంతర్గత కుమ్ములాటలు ఉండడంతో ఇక్కడ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంతృప్తిగా లేదన్నది తెలుస్తున్న విషయం. ఈ మధ్యన పొంగులేటి మరియు జూపల్లిలు ఢిల్లీకి వెళ్లిన సమయంలో వారితో పాటుగా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని అంతా అనుకున్నారు. వార్తలు కూడా ఆ దిశగా బాగా ప్రచారం అయ్యాయి.. కానీ ఎందుకో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం అతని కదలికలు చూస్తుంటే కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి సుముఖంగా ఉన్నారని అర్ధమవుతోంది.
ఈ రోజు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో భేటీ అవ్వడం ఇందుకు మరింత ఊతాన్ని ఇస్తోంది. కాగా రానున్న రోజుల్లో ఏమి ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.