సీఎం ఎవరన్నది హైకమాండ్ చూసుకుంటుంది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

మునుపటితో పోల్చితే ఈసారి ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో నవ్యోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని కాంగ్రెస్ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరన్నదానిపైనా ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.

Komatireddy Venkat Reddy responds to his brother's entry to Congress, says  high command will decide

కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ సీఎం అభ్యర్థులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అవ్వడంపై తనకు ఆసక్తి లేదని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా దృష్టి పెట్టామని అన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. దీంతో పాటు సీఎం ఎవరు అనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని డీకే శివకుమార్ ఎక్కడా అనలేదని, కానీ ఆయన ప్రసంగాన్ని అనువదించిన పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చూపించారని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యే ఒక సీఎం అభ్యర్థేనని కోమటిరెడ్డి అన్నారు. నవంబరు 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news