రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి : జీవీ రెడ్డి

-

రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు, తప్పులు లేకపోతే, అప్పులు ఆదాయ వివరాలు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వాస్తవ సమాచారంతో జగన్ సర్కార్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తోందని ఆర్థికమంత్రి ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని విమర్శించారు.

GV Reddy: వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా?.. జగన్ ఎందుకు  నీరుగార్చారు? | TDP Leader GV Reddy ycp jagan RVRAJU

“కాగ్ మొత్తుకుంటున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదాయ వ్యయవివరాలు బహిర్గతం చేయడంలేదు? ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి మించి ఏపీ అప్పులు చేస్తున్నా… జగన్ సర్కార్ పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితికి మించి అప్పులు చేశాయని కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎందుకు ఉదాసీనతతో ఉంటోంది?” అంటూ కేంద్రం వైఖరిని కూడా జీవీ రెడ్డి నిలదీశారు.

ఇది ఇలా ఉంటె, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హత్యకు సీఎం జగన్ కుట్ర పన్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి అనుమతి ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్లోపాయిజన్ ఇచ్చి చంద్రబాబును హత్య చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు చస్తాడని బహిరంగంగా ప్రకటించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. కోర్టులను కూడా తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో మందులు వాడాలని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news