చావు బతుకుల్లో గేయ రచయిత : కేటీఆర్ సహాయం కోరిన కోన వెంకట్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలతి అలతి పదాలతో అద్భుతమైన పాటలు రాసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కందికొండ. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం సంగీత ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది.

15 సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడిన కందికొండ కోలుకున్న కోలుకుని… ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు రచయిత కోన వెంకట్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కందికొండ కు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోన వెంకట్ కోరారు.

కందికొండ… ఆసుపత్రి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు కోనవెంకట్. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా కందికొండ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు హిట్ పాటలు రచించారు. “మళ్ళి కూయవే గువ్వా, చూపుల్తో గుచ్చి గుచ్చి” లాంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి.