కోన‌సీమ : ఓ యువతా మేలుకో న‌డ‌వ‌డి దిద్దుకో !

-

ప్ర‌శాంత సీమ కోన‌సీమ. మంచి మ‌నుషులు.. మంచి మ‌న‌సులు.. అస్స‌లు ఇందులో సందేహమే లేదు. వీలున్నంత మేర ఇత‌రుల‌కు సాయం చేసే మ‌నుషులు. కొన్ని ఉద్వేగ చ‌ర్యల కార‌ణంగా ఇప్పుడ‌క్క‌డ అస్త‌వ్య‌స్త వాతావ‌ర‌ణం నెల‌కొని ఉండ‌వ‌చ్చు. ఇది కూడా ఈ గ్ర‌హణం కూడా కొన్నాళ్లే ! గ్ర‌హ‌ణం  వీడితే అంతా మ‌ళ్లీ వెలుగులు అలుముకోవ‌డం త‌థ్యం. క‌నుక యువ‌తా ! మేలుకో .. న‌డ‌వ‌డి దిద్దుకో !

ఎవ‌రో జ్వాల‌ను ర‌గిలిస్తే ర‌గిలిపోకండి. సంయ‌మ‌నం పాటించండి. దేశాన్ని ప్రేమించే యువ‌త‌కు ముందు న‌డ‌వ‌డి ముఖ్యం. వ్య‌క్తిత్వం ముఖ్యం. నాయకులు మీపై కేసులు న‌మోదు చేయించ‌గ‌ల‌రు. తీయించ‌నూగ‌ల‌రు. వాళ్ల‌ను న‌మ్మొద్దు.  మీకు తెలుసా ప్ర‌మాద‌కర పీడీ యాక్ట్ కింద ఒక్క‌సారి అరెస్టు అయితే త‌రువాత  లైఫ్ అన్న‌దే ఉండ‌దు. జాగ్ర‌త్త ! జీవితాన్ని దిద్దుకునే క్ర‌మాన్ని ప్రేమించండి చాలు. జీవితాన్ని సాఫీగా న‌డిపే క్ర‌మాన్ని ఎంచుకోండి చాలు. అదే మేలు.

ఇప్ప‌టికే అక్క‌డ పోలీసులు మోహ‌రించి ఉన్నారు. కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశ‌ల్ నేతృత్వంలో కొన్ని బ‌ల‌గాలు అక్క‌డ పనిచేస్తున్నాయి. నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నారు పోలీసులు. ఇర‌వై వాట్సాప్ గ్రూపుల‌లో అల్ల‌ర్ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు న‌డిచాయి. చాటింగ్ లు న‌డిచాయి. వాటిని గుర్తించారు. వాట‌న్నింటి వివ‌రాల ఆధారంగా యువ‌కుల‌పై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి మీ భ‌విష్య‌త్ ఏమౌతుందో మీకైనా అర్థం అవుతుందా ? గొడ‌వ‌లు మాని  హాయిగా మీ కెరియ‌ర్ పై దృష్టి పెట్టండి .. పేరులో ఏమీ లేదు పేద‌ల జీవితాన్ని సంస్క‌రించిన పెద్ద‌ల ఆశ‌య సాధ‌న‌లోనే అంతా ఉంది అని గ్ర‌హించండి.

Read more RELATED
Recommended to you

Latest news