తెల్ల పిల్ల నోట సమంత పాట.. బాబోయ్..

-

తెలుగు సినిమా ఖ్యాతి ఎక్కడి వరకూ వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మన దేశంలో కన్నా వేరే దేశాలలో ఎక్కువగా మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాల బీట్, మాస్ స్టేప్పులతో యావత్ ప్రజానీకాన్ని కాలు కదిపెలా చేస్తున్నాయి. తెలుగు సినిమాలకు అమెరికాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇటీవల బన్నీ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే..పాన్ ఇండియా సినిమాగా ప్రెక్షకుల ముందుకు వచ్చింది.తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నీ రాష్ట్రాల లో సక్సెస్ టాక్ తో దూసుకు పోయింది.

ఇక అమెరికాలో అయితే చెప్పనక్కర్లేదు..అల్లు అర్జున్‌ నటించిన ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గడం లేదు.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఇప్పటికీ దూసుకుపోతోంది. సినిమాలో అల్లు అర్జున్ సిగ్నేచర్ డైలాగ్ గుర్తుంది కదా… ‘తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ చేసిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్‌కు, బన్నీ అభిమానులకు బాగా నచ్చింది. సినిమాకు బోలెడు క్రేజ్ తెచ్చింది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్, హీరో మ్యానరిజం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్షించాయి కూడా. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, క్రికెటర్లు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు అంతా పుష్ప సినిమాలోని సాంగ్స్ కు స్టెప్స్ వేస్తూ అలరిస్తున్నారు.

ఈ చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ లో కనిపించి మెప్పించింది.ఆ పాట మొదట విమర్శలు అందుకున్నా కూడా తర్వాత ఎంత క్రేజ్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారు కూడా హమ్ చేసిన పాట అది.. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఇప్పటికీ సందడి చేస్తోంది. తాజాగా యూఎస్‌లో ఓ 13ఏళ్ల చిన్నారి వయోలిన్‌ వాయిస్తూ ఊ అంటావా, ఊహు అంటావా..అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడయోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పుష్పా సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గడం లేదు.

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫారిన్ అమ్మాయి ‘శ్రీవల్లి’ పాటకు సంబంధించిన మ్యూజిక్ ను వయోలిన్ మీద వాయించి, అందరినీ షాక్‌కు గురయ్యేలా చేసింది..13 ఏళ్ల వయోలిన్ విద్వాంసురాలు కరోలినా ప్రొట్సెంకో ‘శ్రీవల్లి’ పాట వయోలిన్ వెర్షన్‌ను పోస్ట్ చేసి అల్లు అర్జున్ అభిమానులను, పుష్ప ప్రేమికులను ఆశ్చర్యపరిచింది..ఇప్పటికే ఆ పాట ఎంత ఫెమస్ అయ్యిందో తెలిసిందే..ఇప్పుడు మరింత టాక్ ను అందుకుంది.ఆ మ్యూజిక్ కు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news