హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ.. కాసేపట్లో ప్రకటన !

హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా…. బిజెపి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అని ప్రచారం జరుగుతుండగా… అభ్యర్థి నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది.

konda surekha is huzurabad congress candidate

ఈ నేపథ్యంలోనే ఇవాళ గాంధీ భవన్ లో… మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో కొండా సురేఖ, సదానంద, కృష్ణా రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ నేతలు… కొండా సురేఖ కు మాత్రమే మద్దతు కలిగినట్లు సమాచారం అందుతోంది. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరునే అధిష్టానం ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.