బ్రేకింగ్: ఈటెలకు మద్దతుగా కొండా, కోదండ రామ్ కీలక వ్యాఖ్యలు

ఈటెల రాజేందర్ పైన జరిగిన దాడిని ఆత్మ గౌవర దాడిగా పరిగణిస్తాం అని తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. ఈటెల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యాము అని తెలిపారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరిగుతుందో చూడాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

మాజీ ఎంపీ కొండా మాట్లాడుతూ… ఈటెల కుటుంభం పై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారు అని అన్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అని నిలదీశారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదు. ఇవేవీ చేయడానికి కేసీఆర్ ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. ఈటెల విషయంలో మేము అంతా ఆయనకు మద్దతుగా నిలుస్తాం అని అన్నారు.