‘నా వాడే’… కాబోయే భర్త గురించి చెప్పేసిన మెగా డాటర్..!

-

మెగా డాటర్ నీహారిక పెళ్లి ఖాయమైపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయాన్ని స్వయానా నీహారికే తెలియజేసింది. తనకు వివాహం జరగబోతుందని అభిమానులకు తెగ హింట్స్ ఇస్తున్న ఈ కొణిదెల ముద్దుగుమ్మ. నిన్న ఉదయం మిసెస్ అంటూ తెలపగా.. ఆ తర్వాత ఏకంగా ఓ వ్యక్తిని హాగ్ చేసుకున్న ఫోటోను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. అయితే, అందులో తనకి కాబోయే భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలో అప్లోడ్ చేసిన ఫోటోతో అతనెవరో రివీల్ చేసేసింది. తాజాగా, అతను తనవాడే (మైన్) అంటూ ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెట్టింది. కాగా, నీహారికకు కాబోయే భర్త పేరు వెంకట చైతన్యని, అతను గుంటూరు ఐజీ కుమారుడన్న సంగతి ఇప్పటికే సినీ వర్గాల ద్వారా తెలిసిపోయింది. నిన్నటి నుంచి నీహారిక, తన సామాజిక మాధ్యమాల ద్వారా ఒక్కో సస్పెన్స్ నూ రివీల్ చేస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి సస్పెన్స్ రివీల్ చేస్తుందో చూద్దాం.

View this post on Instagram

Mine ❤️ @chaitanya_jv

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Read more RELATED
Recommended to you

Latest news