కొరటాల శివ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటి వరకు ఆయన తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. ఆయన ఎప్పుడూ కొత్త కథలతోనే సినిమా చేస్తాడు. అయితే ప్రతి సినిమాకు కొత్త హీరోయిన్ నే తీసుకుంటున్నాడు.
కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేసి కొత్త సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. కొందరు డైరెక్టర్లు తమకు హిట్ వచ్చిన సినిమాల్లోని హీరోయిన్లనే ఇతర సినిమాలకు తీసుకుంటారు.
ఇప్పుడు కొరటాల కూడా మొదటిసారి అలాంటి సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నాడు. భరత్ అనే నేను సినిమాలోని హీరోయిన్ కియారా అద్వానీని ఎన్టీఆర్ తో చేసే సినిమాలో తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మరి ఆ సెంటిమెంట్‌తో మళ్లీ హిట్ కొడుతాడా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి మరీ కొరటాలతో సినిమా చేస్తున్నాడు.