ప్రాంతీయ భాషల్లోకి కోవిన్ పోర్టల్.. కరోనా కొత్త రకాలపై మరో 17ల్యాబులు..

-

కరోనా వ్యాక్సినేషన్ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కోవిన్ యాప్ ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ హిందీ సహా 14ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. అదే కాకుండా కరోనా కొత్త రకాలపై మరో 17ల్యాబోరేటరీలను ప్రారంభించింది. ఈ మేరకు ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలియజేసారు. మంత్రుల బృందం నిర్వహించిన 26వ సమావేశంలో ఈ విధానాలను సరికొత్తగా తీసుకొచ్చారు.

కరోనా కొత్త వేరియంట్లపై పరిశోధన చేస్తున్న INSACOG network కి 17ల్యాబోరేటరీలను కలిపారు. ఇప్పటికే 10పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లపై పరిశోధనలు జరిపి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టేందుకు వేరియంట్లపై పరిశోధన చాలా అవసరమని గుర్తించిన ప్రభుత్వం 17కొత్త ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా కేసులుతగ్గుతున్నాయని, ఇప్పుడు రోజువారి కేసులు 3లక్షల దిగువకి చేరాయని, 26రోజుల తర్వాత ఇది సంభవించిందని అన్నారు.

ఇంకా డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-DGమార్కెట్లోకి వచ్చిందని, డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మందు, కరోనా ద్వారా ఆక్సినజ్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితిని రాకుండా ఉంచుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మందుకి అత్యవసర వినియోగం కింద DCGIనుండి అనుమతి కూడా వచ్చింది. ఈ మందుపై పరిశోధన గత ఏడాది ఏప్రిల్ లో మొదలైందని, ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల అవుతున్న ఈ మందు గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని ఆరోగ్య మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news