మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఇప్పుడు హీరోయిన్ ఎవరిని ఖరారు చేస్తారు అనేది ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. దాదాపు రెండు నెలల నుంచి హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద చిత్ర యూనిట్ ఎన్నో కసరత్తులు చేసింది. ముందు త్రిష ని దాదాపుగా ఖరారు చేసారు.
ఏమైందో ఏమో తెలియదు గాని ఆమెను వద్దనుకున్నారు. ఆ తర్వాత అనుష్క పేరు వినపడింది. మళ్ళీ నయనతారని ఖరారు చేస్తారని భావించారు అందరూ. కాని ఆమె పేరు కూడా వద్దని పక్కన పెట్టారు. దానికి కారణం పారితోషికం ఎక్కువగా ఉండటమే అని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి పక్కన ఖైదీ నెంబర్ 150 సినిమా చేసిన కాజల్ ని ఖరారు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. ఈ ఏడాది ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.