పంచారామాలలో ఒకటైన కుమారారామం. ఇక్కడ శివ లింగం ఎత్తు పద్నాలుగు అడుగులు. ఇక్కడ ఉన్న భీమ గుండంలో స్నానం చేస్తే కోరిన కోరికలు తీరడమే కాక చేసిన పాపాలు అన్ని పటాపంచలు అవుతాయి అని భక్తుల నమ్మకం. క్రీ .శ 11వ శతాబ్దంలో చాళుక్య రాజులచే నిర్మించిన ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటలో ఉంది.
ఈ ఆలయం నిర్మాణం క్రీ.శ 892 నుంచి 922 వరకు కొనసాగింది. తర్వాత 1340-1466 మద్య ఈ ఆలయాన్ని కాకతీయులు పుననిర్మించారు. పూర్వం తారకాసురున్ని సుబ్రమణ్యస్వామి వధించినప్పుడు తారకుడి గొంతులో ఉన్న ఆత్మ లింగం అయిదు భాగాలుగా పడుతుంది. అవే పంచారామాలుగా వెలిసాయి. అమరారామం, క్షీరారామం, భీమారామం, కుమారారామం, ద్రాక్షారామంగా పిలవబడతాయి.ఇక్కడి సున్నపు రాయితో తయారైన శివ లింగం పద్నాలుగు అడుగులతో నయనానందకరంగా శోభిల్లుతోంది .
ఆ లింగాకారం అంతకంతకు పెరుగుతుందని తలపై శీల కొట్టారని స్థానికంగా ఉన్న కథనం. స్వామి వారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. ఇంకా ఇక్కడ అమ్మ వారు బాల త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటుంది. ఇంకా ఇక్కడ వినాయకుడు, నవగ్రహాలు, శివుడు కొలువు తీరి ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం.