నేను త్రివిక్రమ్ కు రుణపడి ఉన్నా… కోటా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చదువుకున్న వ్యక్తి…సంస్కార వంతుడు అని అన్నారు. జంధ్యాల, ఆత్రేయ కోవలో మాటలు రాయగల సమర్థుడు అని కోటా అన్నారు. ఆయన రాసిన డైలాగ్స్ అసలు పలికినట్టే ఉండదు కానీ అందులో చాలా భావం ఉంటుందని అన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో తనకు మేకప్ వేసి తలపాగా చుట్టడం ఆ గెటప్ గమ్మత్తుగా అనిపించింది అని కోటా అన్నారు.

Kota Srinivas comments on triviram
Kota Srinivas comments on triviram

ఆ తరవాత డైలాగ్ పేపర్ ఇచ్చారని కానీ ఏమీ అర్థం కాలేదని చెప్పారు. షాట్ పూర్తయిన తరవాత త్రివిక్రమ్ వచ్చి …దైర్యం తోనే ఆడైలాగులు రాశాను అండి మీరు అయితే ఆ డైలాగులను చెప్పగలరు అని విష్ చేశారని తెలిపారు. ఆ రోజును జీవితంలో మర్చిపోలేను అంటూ కోటా వ్యాఖ్యానించారు. ఇక ఆ సినిమాలో తాను చెప్పిన డైలాగులు, నటన బాగున్నాయని ఎంతోమంది చెప్పారని అలాంటి పాత్ర ఇచ్చిన త్రివిక్రమ్ కు రుణపడి ఉంటా అని కోటా అన్నారు.